Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నీతి నిజాయతీకి మారుపేరు వాజ్ పేయి: బాబు

నీతి, నిజాయతీకి అటల్ బిహారీ వాజ్ పేయి మారుపేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మాజీ ప్రధాని వాజ్ పేయికి భారతరత్న ప్రకటించడం ముదావహమని అన్నారు. సమస్యలకు రాజీలేని పరిష్కారాలు చూపిన వాజ్ పేయికి అత్యున్నత పురస్కారం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. చాలా విషయాల్లో ఆయన చూపిన చొరవను భారతజాతి ఎన్నడూ మర్చిపోదని ఆయన తెలిపారు. నాడు ఆయన పాలనే ఎన్డీయేకు శ్రీరామరక్షగా నిలిచిందని అన్నారు. నదులను అనుసంధానం చేసేందుకు, అంతర్జాతీయ స్థాయి రోడ్లను రూపొందించడంలో వాజ్ పేయి అద్భుతమైన చొరవ చూపించారని ఆయన పేర్కొన్నారు.

More Telugu News